శ్రీ పార్వతి అమ్మవారికి సారె

2023-07-14
యనమలకుదురు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాడమాసం సందర్బంగా శ్రీ పార్వతి అమ్మవారికి సారె బోసుబొమ్మ సెంటర్ నందు సంగా రెసిడెన్సీ నుండి మేళ తాళలతో, మంగళవాయిద్యాలతో, కోలాట నృత్యము, వేద స్వస్తి తో శ్రీ సంగా నరసింహారావు, విజయలక్ష్మి దంపతులచే శ్రీ పార్వతి అమ్మవారికి సారె సమర్పించడం జగిగినది. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు.

మొదటగా దేవస్థానానికి చేరిన తదుపరి శ్రీ జి.ఆర్.వి. సాగర్ (ముఖ్య అర్చక) మరియు ఇతర అర్చకులు, కార్యనిర్వాహాణాదికారి వారు ఆహ్వానం పలికి ప్రదక్షిణతో ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం జపిస్తూ నాంగేంద్ర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని ప్రాకారంలో దేవతా మూర్తులు గణపతి పూజ, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర శ్రీ రామ లింగేశ్వర స్వామి వారికి షోడ శోపచార పూజలు మరియు శ్రీ పార్వతి అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పించి లలిత త్రిశతి నామాలతో కుంకుమ పూజ తదుపరి నీరాజన మంత్ర పుష్పములతో అర్చన జరిగినది.

వచ్చిన ప్రతి భక్తునికి అమ్మవారి ఆశీస్సులతో నైవేద్యముగా సమర్పించిన ప్రసాదములను ఇవ్వడమైనది.

శ్రీ శివసౌదం అన్నధాన భవనము నందు భక్తులకు అన్న ప్రసాద వితరణ శ్రీ శ్రీ శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ యనమలకుదురు వారు సుమారుగా రెందు వేల మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినారు.

పై కార్యక్రమములను దేవాలయ కార్యనిర్వాహణాధికారి, మరియు దేవాలయ సిబ్బంది పర్యవేక్షించినారు.

ది.15-7-2023 శనివారం త్రయోదశి సందర్బంగా ప్రదోషకాలమునందు అనగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీ నందీశ్వర స్వామి వారికి అభిషేకము మరియు అలంకరణ నీరాజన మంత్ర పుష్పములతో అర్చన జరుగునని కార్యనిర్వాహణాదికారి ఒక ప్రకటనలో తెలియజేసారు.









శ్రీ స్వామివారి దేవస్థానము నందు భక్తులు పరోక్షంగా తమ గోత్ర నామములతో పూజలు చేయించదలచిన వారు, పరోక్ష సేవల ద్వారా, మరియు కానుకలు, విరాళములు చెల్లించు వారు e-హుండీ e-డొనేషన్స్ ద్వారా aptemples.ap.gov.in వెబ్ సైట్ నందు చెల్లించగలరు.

గోత్ర నామములు దేవస్థానమునకు వాట్స్ ఆప్ ద్వారా పంపించగలరు.

7386 160555