స్వామి వారికి 108కేజీల నేరేడు పండ్లతో అభిషేకము మరియు పూజ

2023-07-13
యనమలకుదురు, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ది.13-07-2023 శ్రీ స్వామి వారికి 108 కేజీల నేరేడుపండ్లుతో అభిషేకము మరియు పూజ జరిగినది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించినారు. ఆలయ అభివృద్ధి దాత శ్రీ సంగా నరసింహారావు గారు, కార్యనిర్వాహణాధికారి వారి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు GVR సాగర్ గారు అత్యంత వైభవంగా నిర్వహించినారు.

ది.14-07-2023 శుక్రవారము ఉదయము 09:00గం,,కు ఆషాడమాసం సందర్భముగా యనమలకుదురు గ్రామములోని బోసు బొమ్మ సెంటర్ లో గల సంగా రెసిడెన్సీ నుండి శ్రీ సంగా నరసింహారావు, విజయ లక్ష్మి గారి దంపతులచే శ్రీ పార్వతీ అమ్మవారికి ఆషాడసారె మంగళ వాయిద్యములతో ఉరేగింపుగా తీసుకురావటం జరుగును. పూజ అనంతరం దేవస్థానంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయటమైనది.

గమనిక: ఉదయం 8.00 టిఫిన్స్ సంగా రెసిడెన్సీ వద్ద ఏర్పాటు కలదు. మధ్యాహ్నo 12.00 గo లకు కొండపైన అన్నదానభవనo నందు అన్న సంతర్పణ జరుగును, కావున పై కార్యక్రమములో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి మరియు అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు
కార్యనిర్వాహణాధికారి
శ్రీ స్వామివారి దేవస్థానము నందు భక్తులు పరోక్షంగా తమ గోత్ర నామములతో పూజలు చేయించదలచిన వారు, పరోక్ష సేవల ద్వారా, మరియు కానుకలు, విరాళములు చెల్లించు వారు e-హుండీ e-డొనేషన్స్ ద్వారా aptemples.ap.gov.in వెబ్ సైట్ నందు చెల్లించగలరు.

గోత్ర నామములు దేవస్థానమునకు వాట్స్ ఆప్ ద్వారా పంపించగలరు.

7386 160555